Header Banner

లోకేష్ పరువు నష్టం కేసు కోర్టులో కీలక మలుపు! నేడు విశాఖ కోర్టులో విచారణ!

  Thu Apr 10, 2025 10:01        Politics

సాక్షి’ (Sakshi) దినపత్రిక (newspaper)లో ఉద్దేశపూర్వకంగా రాసిన తప్పుడు కథనం (controversy)పై రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్‌ (Minister Lokesh) న్యాయపరంగా పోరాడుతున్నారు. ఈ కేసులో గురువారం ఉదయం 10 గంటలకు విశాఖ 12వ అడిషనల్ జిల్లా కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ (Cross-Examination) జరగనుంది. దీనికి లోకేష్ హాజరవుతున్నారు. ఇప్పటికే ఒకసారి క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. ఈసారి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి కానుండడంతో ఈ కేసు కీలక దశకు చేరనుంది. మంత్రి లోకేష్ తరఫున సీనియర్ న్యాయవాది కోటేశ్వరరావు, ఇతర న్యాయవాదులు హాజరవుతారు. 2019 అక్టోబర్ 22న ‘చినబాబు చిరుతిండి.. రూ. 25 లక్షలండి’ అనే శీర్షికతో సాక్షి దనపత్రికలో ఓ కథనం ప్రచురించారు. ఈ కథనం పూర్తిగా అవాస్తవాలతో ఉందని, ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టను మంటకలపాలనే దురుద్దేశంతోనే ప్రచురించారంటూ సాక్షి దినపత్రికకు మంత్రి లోకేష్ రిజిస్టర్ నోటీసు పంపించారు. అయితే అటునుంచి ఎలాంటి వివరణ రాలేదు. తాము రాసిన కథనం ఆధారాలతోనే రాశామని, ఇందులో అసత్యమేమీలేదని నిరూపించే వివరణ ఏదీ రాలేదు. తాను పంపిన నోటీసులకు స్పందించకపోవడంతో మంత్రి లోకేష్ తన న్యాయవాదులతో పరువు నష్టం దావా వేశారు. ఈ కథనంలో చెప్పినట్లుగా ఆ రోజుల్లో తాను అసలు విశాఖలో లేనని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఆహ్వానం మేరకు వచ్చే అతిధులకు చేసిన మర్యాదల ఖర్చును తనకు అంటగడుతూ.. తన ప్రతిష్టను మసకబార్చేందుకు చేసిన కుట్ర ఇది అని.. దీనిపై విచారించి న్యాయం చేయాలని కోర్టును కోరారు.


ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!


ఈ కేసుకు సంబంధించి గురువారం క్రాస్ ఎగ్జామినేషన్ జరిగనుంది. అది ఎక్కువ సేపు పట్టే అవకాశాలు తక్కువే. ఆ తర్వాత ఏంటి.. తీర్పు ఎలా ఉంటుంది.. తీర్పు ఎవరిపై ఉంటుంది.. ఒక వేళ తీర్పు లోకేష్‌వైపు ఉంటే.. సాక్షి పత్రిక యాజమాన్యాన్ని పరువు నష్టం పరిహారం కింద డబ్బులు చెల్లించమని ఆదేశిస్తారా.. ఇలా ఈ కేసు తీర్పుపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. కాగా రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్‌ బుధవారం రాత్రి విశాఖపట్నం వచ్చారు. రాత్రి 7.45 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఆయన రోడ్డు మార్గంలో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే రాత్రి బస చేశారు. గురువారం ఉదయం 10.15 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి జిల్లా కోర్టుకు వెళతారు. తనపై తప్పుడు కథనం ప్రచురించిందని ‘సాక్షి’ దినపత్రికపై ఆయన గతంలో పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు విచారణకు ఆయన హాజరుకానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు కోర్టు నుంచి బయలుదేరి విమానాశ్రయానికి చేరుకుని విజయవాడకు వస్తారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #NaraLokesh #DefamationCase #SakshiControversy #VisakhapatnamCourt